సిగరెట్ల దొంగల ముఠా అరెస్ట్‌ | Police arrested Cigarette thieves | Sakshi
Sakshi News home page

సిగరెట్ల దొంగల ముఠా అరెస్ట్‌

Sep 15 2017 12:39 PM | Updated on Mar 28 2018 11:26 AM

రూ.4 కోట్ల విలువ చేసే సిగరేట్లు కాజేసి ఉడాయించిన దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా: అంతర్రాష్ట్ర సిగరేట్ల దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ..  గత నెల 20న కంటైనర్లో తిరుపతి రేణిగుంట నుంచి ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న 647 కాటన్ సిగరెట్ బాక్సులను కంజర్‌ గ్యాంగ్‌ దోపిడీ చేసింది. ఫింగర్ ప్రింట్స్, టోల్ ప్లాజాల్లో సీసీ ఫుటేజ్ ల ఆధారంగా కేసును ట్రేస్‌ చేశాం.
 
మధ్యప్రదేశ్ కు చెందిన 25 మంది సభ్యుల కంజర్ గ్యాంగ్ రెక్కీ వేసి దోపిడీ చేసింది. ఈ కేసులో ఇప్పటికి  నలుగురిని మధ్యప్రదేశ్‌లోని దేవస్ జిల్లాలో అరెస్ట్ చేశాం. మధ్యప్రదేశ్ లో కంజర్ గ్యాంగ్ పేరు మోసిన దొంగల ముఠా. దోపిడీలో పాల్గొన్న మరో 20 మంది కోసం గాలిస్తున్నాం. ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు 5 రాష్ట్రాల్లో  50 కోట్లకు పైగా విలువైన గూడ్స్ ను దోపిడీ చేశారని కమిషనర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement