కల్లు తాగండోయ్‌.. నల్లమందు మానండోయ్‌  | Pocharam Srinivas Reddy Said Do Not Drink Alcohol | Sakshi
Sakshi News home page

కల్లు తాగండోయ్‌.. నల్లమందు మానండోయ్‌ 

Nov 27 2018 4:15 PM | Updated on Nov 27 2018 4:19 PM

Pocharam Srinivas Reddy Said Do Not Drink Alcohol - Sakshi

వృద్ధుడికి కల్లు పోస్తున్న పోచారం 

 సాక్షి, బాన్సువాడరూరల్‌: స్వచ్ఛమైన ఈత కల్లు ఆరోగ్యానికి మంచిదని, నల్లమందుతో అనారోగ్యంతో పాటు జేబుకు చిల్లేనని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనాపూర్‌ గ్రామానికి వచ్చిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గౌడ కులస్తులు ఈతకల్లు లొట్టిని బహుకరించారు.

కాస్తరుచి చూసిన ఆయన దాన్ని మరికొందరికి ఇలా పంచుతూ ఆకట్టుకున్నారు. అంతకు ముందు సోమ్లా నా యక్‌ తండాలో గిరిజన మహిళల కోరిక మేరకు వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement