రూ.11 లక్షల విలువచేసే పామాయిల్ సీజ్ | palm oil seized in warangal distirict | Sakshi
Sakshi News home page

రూ.11 లక్షల విలువచేసే పామాయిల్ సీజ్

Jun 13 2015 9:57 AM | Updated on Sep 3 2017 3:41 AM

అక్రమంగా పామాయిల్‌ను నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అయిల్‌స్టోర్‌పై దాడి చేశారు.

నెక్కొండ: అక్రమంగా పామాయిల్‌ను నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అయిల్‌స్టోర్‌పై దాడి చేశారు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలోని తిరుమల అయిల్ స్టోర్‌లో అక్రమంగా పామాయిల్ నిల్వ చేసినట్టు అధికారులకు సమాచారం రావడంతో దాడి చేశారు. ఈ దాడిలో రూ. 11 లక్షల విలువ చేసే పామాయిల్‌ను నిల్వ ఉంచినట్లు గుర్తించి అధికారులు ఆయిల్ నిల్వలను సీజ్ చేశారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement