'లోపాలున్నా సచివాలయాన్ని మార్చక్కర్లేదు' | no need to change Secretariat for vasthu defects | Sakshi
Sakshi News home page

'లోపాలున్నా సచివాలయాన్ని మార్చక్కర్లేదు'

Jan 31 2015 8:10 PM | Updated on Sep 2 2017 8:35 PM

లోపాలున్నంత మాత్రన సచివాలయాన్ని మార్చాల్సిన అవసరం లేదని ప్రముఖ వాస్తు నిపుణులు సురేష్ తెలిపారు.

చిన్న చిన్న వాస్తు లోపాలున్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని మార్చాల్సిన అవసరం లేదని వాస్తు నిపుణులు సురేష్ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తు సిద్ధాంతాన్ని నమ్మడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. సచివాలయానికి వాస్తు దోషం ఉన్నమాట వాస్తవమే అయినా, ఈ లోపాలను వాస్తు సిద్ధాంతంలో నివారణ మార్గల ద్వారా సరిచేసుకోవచ్చని ఆయన సూచించారు. నైరుతి వీధి పోటు వల్ల పాలకుడికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.


నిర్మాణ లోపాలను చూపే వాస్తులోనే పరిష్కార మార్గలు కూడా ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ భవన్కు కూడా వాస్తు దోషాలుంటే కేసీఆర్ సవరించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత సచివాలయాన్ని యథాతథంగా కొనసాగిస్తూ అవసరమైన మార్పులు చేస్తే సరిపోతుందని సరేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement