నిరంతర విద్యుత్‌ వద్దు | No need of continuous electricity | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ వద్దు

Published Thu, Sep 7 2017 2:46 AM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM

వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా వద్దని, 12 గంటలు చాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల జిల్లాలో రైతుల రాస్తారోకో
 
సిరిసిల్ల రూరల్‌: వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా వద్దని, 12 గంటలు చాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కి చెందిన రైతులు బుధవారం సిరిసిల్ల అర్బన్‌ మండలం చంద్రంపేట క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సుమారు 60 మంది రైతులు స్థానిక ‘సెస్‌’ కార్యాల యానికి తరలి వచ్చారు. ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.

నిరంతర  సరఫరా తో పంపుసెట్లు ఏకధాటిగా నడిచి   బావు ల్లో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని, తద్వారా మోటార్లు కాలి పోతున్నా యని ఆవేదన చెందారు. ఇది చిన్న, సన్నకారు రైతులకు విఘాతం కలిగిస్తోం దని చెప్పారు.  12 గంటల పాటు విడతల వారీగా అందిస్తే సరిపోతుందని విన్నవించారు. అనంతరం సెస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement