'మైనార్టీల రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి' | N.Uttam kumar reddy takes on Telangana cm kcr | Sakshi
Sakshi News home page

'మైనార్టీల రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి'

Jun 19 2015 2:02 PM | Updated on Aug 29 2018 5:52 PM

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ కేసీఆర్పై శుక్రవారం హైదరాబాద్లో ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు.

లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామన్న కేసీఆర్... వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామన్న రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్నారు. రంజాన్ ముగిసేలోగా ఈ ప్రక్రియను అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement