దైవ దర్శనానికి వెళుతూ... | Moving god visit in road accident | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళుతూ...

Jan 19 2015 4:33 AM | Updated on Sep 2 2017 7:52 PM

దైవ దర్శనానికి వెళుతూ...

దైవ దర్శనానికి వెళుతూ...

దేవున్ని మనసారా దర్శించుకోవాలనుకున్న వారి కోరిక తీరకుండానే ఆ దైవం చెంతకు చేరిపోయారు.

రఘునాథపల్లి /హన్మకొండ: దేవున్ని మనసారా దర్శించుకోవాలనుకున్న వారి కోరిక తీరకుండానే ఆ దైవం చెంతకు చేరిపోయారు. దైవ దర్శనానికి వెళుతున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం పాలైన విషాద ఘటన ఆది వారం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కోమల్ల, రఘునాథపల్లి మధ్యనగల వెంకటాయపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

వివరాలు.. హన్మకొండ నక్కలగుట్టకు చెందిన ట్రాన్స్‌కోలో  సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లుట్ల రవీందర్‌రెడ్డి (54), భార్య అనురాధ(46), కుమార్తె నితిక(24)తోపాటు సమీప బంధువు భువనేశ్వరి, డ్రైవర్ రాజుతో కలిసి తన టాటా సుమోలో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్‌లోని కొత్తబస్తీ చైతన్యపురికి చెందిన 12మంది ట్రావెల్ వ్యాన్‌లో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి మేడారం వెళ్తున్నారు.

ఈ క్రమంలో వెంకటాయపాలెం వద్దకు చేరుకోగానే ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు వాహనాలు ఒక్కసారిగా ఢీకొన్నాయి. టాటాసుమో ట్రావెల్ వ్యాన్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టి అదే ఊపులో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రవీందర్‌రెడ్డి భార్య అనురాధ, కూతురు నితిక అక్కడికక్కడే మృతిచెందారు.

తీవ్ర గాయాలపాలైన రవీందర్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయాలపాలైన డ్రైవర్ రాజు, భువనేశ్వరిలను జనగామ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దమ్మాయికి వివాహమై హైద రాబాద్‌లో ఉంటున్నారు. సోమవారం అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు పేర్కొ న్నారు.
 
స్వల్ప గాయాలతో..
ట్రావెల్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన చింతగట్ల అరుణ, దామోదర్‌రెడ్డి, అరుంధతి, జయపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డికి స్వల్పగాయాలు కాగా, మిగతావారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జనగామ రూరల్ సీఐ సతీష్, టౌన్ సీఐ నర్సింహ ఘటనా స్థలికి చేరుకుని బాధితులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement