ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌కు డెంగీ జ్వరం

MLC Farooq Hussain Joins In Hospital With Dengue Fever - Sakshi

సాక్షి, సిద్దిపేట : సిద్దిపేటకు చెందిన రాష్ట్ర శాసన మండలి సభ్యుడు ఫారూక్‌ హుస్సేన్‌కు డెంగీ జ్వరం సోకింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. తొలుత జ్వరం తీవ్రత అధికంగా ఉండటంతో సిద్దిపేటలో ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు డెంగీ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఫారూక్‌ హుస్సేన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన బంధువులు తెలపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top