గెలిపిస్తే రాష్ట్రానికి, కేంద్రానికి వారధిగా పని చేస్తాం | MLC election campaign, the BJP leaders | Sakshi
Sakshi News home page

గెలిపిస్తే రాష్ట్రానికి, కేంద్రానికి వారధిగా పని చేస్తాం

Jan 3 2015 2:16 AM | Updated on Mar 29 2019 9:31 PM

గెలిపిస్తే రాష్ట్రానికి, కేంద్రానికి వారధిగా పని చేస్తాం - Sakshi

గెలిపిస్తే రాష్ట్రానికి, కేంద్రానికి వారధిగా పని చేస్తాం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి మధ్య వారధిగా ఉండి అధిక నిధులు తెచ్చి ....

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు
 
పర్వతగిరి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి మధ్య వారధిగా ఉండి అధిక నిధులు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు  కృషి చేస్తామని బీజేపీ  క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రాజేశ్వర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని లయోల హైస్కూల్‌లో జీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షతన  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వర్‌రావుతోపాటు పార్టీ రాష్ట్ర నాయకులు మహిపాల్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, మార్తినేని ధర్మారావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావు మాట్లాడారు. రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ మూడు జిల్లాల్లో 10 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారని, వారు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని వాపోయూరు. 25 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను సమర్ధవంతంగా చేపడుతున్న విద్యావేత్త, మానవతావాది వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావుకు పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి  గెలిపిస్తే తెలంగాణతోపాటు వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.

స్వగ్రామం నుంచి ప్రచారం ప్రారంభించిన  రాంమోహన్‌రావు

వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టాభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావు తన స్వగ్రామం కల్లెడ నుంచి ఎన్నికల ప్రచారం  ప్రారంభించారు. తొలుత తాను నెలకొల్పిన శ్రీకొలను వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్లెడలోని ఆర్‌డీఎఫ్ పాఠశాల, కళాశాలలో ప్రారంభించారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులతో మాట్లాడి మొదటి ప్రాధాన్య ఓటు బీజేపీకి వచ్చేలా కృషి చేయాలన్నారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కలిసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాంచందర్‌రావు, జయపాల్‌రెడ్డి, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజలింగంగౌడ్,  మండ ల అధ్యక్షుడు శ్రీధర్, సాంబయ్య యాదవ్, దేవేందర్, బాసాని సారంగపాణి,టీడీపీ నాయకుడులు దామోదర్, జడల కృష్ణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement