ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య | Maoists kill suspected informer | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య

May 31 2015 10:41 AM | Updated on Nov 6 2018 8:50 PM

పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు హతమార్చారు.

ఖమ్మం:

పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు హతమార్చారు. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తిని శనివారం రాత్రి తీసుకెళ్లి చర్ల మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో పసుపుగుప్ప అటవీ ప్రాంతంలో హతమర్చారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని చూసిన స్థానికులుపోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement