ఎన్టీపీసీ సమీపంలో దారి దోపిడీ | Man robbed near NTPC | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ సమీపంలో దారి దోపిడీ

Dec 18 2015 7:06 PM | Updated on Oct 9 2018 5:39 PM

కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు సమీపంలో రాజీవ్ రహదారిపై ఆగంతకులు ఓ వ్యక్తి నుంచి నగదు, గొలుసు దోపిడీకి పాల్పడ్డారు.

జ్యోతినగర్ : కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు సమీపంలో రాజీవ్ రహదారిపై ఆగంతకులు ఓ వ్యక్తి నుంచి నగదు, గొలుసు దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం రామగుండం పట్టణానికి చెందిన పాత లక్ష్మయ్య ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి అతన్ని ఆపారు. తమ వద్ద పర్సు దొంగిలించుకొస్తున్నావంటూ అడ్డగించి లక్ష్మయ్య దగ్గరున్న రూ.21వేల నగదు, మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement
 
Advertisement
Advertisement