రైలు ఢీకొని వ్యక్తి మృతి | Man dies in Train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Dec 13 2015 7:21 PM | Updated on Sep 3 2017 1:57 PM

పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సికింద్రాబాద్ : పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం..మౌలాలి-లాలాగూడ రైల్వేస్టేషన్ల మధ్య విజయ డెయిరీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై సుమారు 30 సంవత్సరాల వయసున్న వ్యక్తి పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement