దేశంలోనే మెరుగైన పరిహారం | Mallanna Sagar Oustees Elated over R And R Package | Sakshi
Sakshi News home page

దేశంలోనే మెరుగైన పరిహారం

May 9 2019 4:32 AM | Updated on May 9 2019 4:32 AM

Mallanna Sagar Oustees Elated over R And R Package - Sakshi

తొగుట (దుబ్బాక): బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిహారం చెక్కులు అందజేస్తోంది. బుధవారం ఈ మేరకు మండలంలోని బ్రాహ్మణ బంజేరుల్లి, రాంపురం, లక్ష్మాపురం, ఏటిగడ్డ కిష్టాపురం, వేములఘాట్, పల్లేపహాడ్‌ గ్రామాల్లో నిర్వాసితుల పునారావాస, ఉపాధి కల్పన (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కో గ్రామంలో 14 కౌంటర్లు ఏర్పాటు చేసి పరిహారం చెక్కులు అందజేశారు.

దీంతో ఆయా గ్రామా ల్లో పండుగ వాతావరణం నెలకొంది. చెక్కులు పంపి ణీ చేసేందుకు గ్రామాలకు వచ్చిన అధికారులకు మంగళహారతులు, మేళతాళాలతో నిర్వాసితులు స్వాగతం పలికారు. నిర్వాసితులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పరిహారం అందించిన సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డి, జేసీ పద్మాకర్, గడా అధికారి ముత్యంరెడ్డి, సీపీ జోయల్‌ డేవిస్, డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ నారాయణలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఘనంగా సన్మానించారు. జిల్లా అధికారులతోపాటు పక్క జిల్లాల రెవెన్యూ అధికారులు కూడా పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెక్కుల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

గరిష్టంగా రూ.కోటి పరిహారం
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరు జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ.. నిర్వాసితులకు మెరుగైన çపునరోపాధి, పునరావాసం ప్యాకేజీ అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ముంపు గ్రామాల్లో కోల్పోతు న్న వ్యవసాయ కొట్టాలు, పండ్ల తోటలు, బావు లు, బోరు బావులు, చెట్లు, పైప్‌లైన్‌లకు కూడా ప్రత్యేక పరిహారం అందజేశామన్నారు. నష్టపోయిన కుటుంబానికి రూ.7.50 లక్షలు, 250 గజా ల ఇంటి స్థలంతోపాటు ప్రతి కుటుంబానికి 6 రకాలుగా పరిహారం అందజేస్తున్నామన్నారు. దీంతో ఒక కుటుంబానికి గరిష్టంగా సుమారు రూ.కోటి పరిహారం అందుతుందని అధికారులు వివరిస్తున్నారు. దేశంలో ఇంత భారీ మొత్తంలో నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని జిల్లా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement