రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం | Lorry driver killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం

Sep 23 2015 12:06 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఆగి ఉన్న లారీని.. మరో లారీ ఢీ కొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు.

ఆగి ఉన్న లారీని.. మరో లారీ ఢీ కొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..  నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. పిల్లల మర్రి స్టేజి సమీపంలోని దాబా వద్ద రాథేశ్యాం యాదవ్(35) అనే వ్యక్తి తన లారీ అద్దాలు తుడుచుకుంటున్నాడు. ఇంతలో మరో లారీ రివర్స్ చేస్తూ.. అతడిని ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య నలిగి రాథ్యేశ్యాం అక్కడికక్కడే మరణించాడు. ఏఎస్సై జహంగీర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement