2017 జూలై నాటికి మెట్రో పూర్తి | L&T begins leasing commercial space along Hyderabad Metro | Sakshi
Sakshi News home page

2017 జూలై నాటికి మెట్రో పూర్తి

Jun 11 2015 4:16 AM | Updated on Sep 4 2018 3:39 PM

2017 జూలై నాటికి మెట్రో పూర్తి - Sakshi

2017 జూలై నాటికి మెట్రో పూర్తి

అన్ని ఆటంకాలనూ అధిగమించి 2017 జూలై నాటికి మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్టీ మెట్రో రైల్ ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టంచేశారు.

సాక్షి, హైదరాబాద్: అన్ని ఆటంకాలనూ అధిగమించి 2017 జూలై నాటికి మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్ టీ మెట్రో రైల్ ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టంచేశా రు. నగరంలోని 3 కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘హైదరాబాద్ నెక్ట్స్-ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్‌మెంట్ (మెట్రో ప్రాజెక్టులో భాగంగా వాణిజ్య మాల్స్, రియల్‌ఎస్టేట్ అభివృద్ధి)’ లోగోను ఆవిష్కరించిన సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి, గాడ్గిల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

అసెంబ్లీ వెనుకవైపు నుంచి మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై స్పష్టత వచ్చిందని చెప్పారు. సుల్తాన్‌బజార్‌లో మెట్రో మార్గం మార్పుపై ఎల్‌అండ్‌టీ సూచించిన 2 ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పాతనగరంలో అలైన్‌మెంట్ మార్పు చేసిన పక్షంలో తలెత్తే ఇబ్బందులపై అధ్యయనం కొనసాగుతోందని చెప్పారు.
 
పంజాగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్‌సిటీల్లో మెట్రో మాల్స్
మెట్రో ప్రాజెక్టుకు మొత్తం రూ.14,132 కోట్లు వ్యయం చేస్తుండగా.. ఇప్పటివరకూ సుమారు రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని గాడ్గిల్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పంజాగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో మూడు భారీ మెట్రో మాల్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. మొత్తం మూడు కారిడార్లలోని 64 స్టేషన్లు, దశలవారీగా 12 ప్రాంతాల్లో నిర్మించనున్న మెట్రో మాల్స్‌లో 18.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. వీటిలో ఎంన్‌సీ కంపెనీల కార్యాలయాలు, మల్టీప్లెక్స్‌లు, హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, రిటైల్ షాపింగ్ స్టోర్లు ఉంటాయన్నారు.

మెట్రో ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న వాణిజ్య మాల్స్ నిర్మాణానికి, రియల్‌ఎస్టేట్ అభివృద్ధికి ఎల్‌అండ్‌టీ రూ.6,300 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మెట్రో ప్రాజెక్టులో 50 శాతం ఆదాయం టికెట్ల విక్రయం ద్వారా, మరో 45 శాతం ఆదాయం మాల్స్, వాణిజ్య స్థలాల అభివృద్ధి ద్వారా, మరో ఐదు శాతం స్టేషన్ల వెలుపల, బయటా వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన పారిశ్రామిక విధానం ద్వారా నగరానికి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం పలు రూట్లలో మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయని, గడువులోగా పనులు పూర్తి చేస్తామన్నారు. మెట్రో ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌కు సింగపూర్ లుక్ రానుం దన్నారు. సమశీతల వాతావరణం, కాస్మోపాలిటన్ కల్చర్, భిన్న భాషలు, సంస్కృతులున్న నగరంలో మెట్రో మరో మైలురాయి కానుందన్నారు. ఈ కార్యక్రమంలో మెట్రో కమర్షియల్, అడ్వర్టైజ్‌మెంట్, స్టేషన్ రిటైల్ బ్రోచర్లను ఎన్వీఎస్ రెడ్డి, గాడ్గిల్ ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement