తొలి హమీకే తూట్లు పొడిస్తే ఎలా? | kishan reddy demand telangana government for farm loan waiver | Sakshi
Sakshi News home page

తొలి హమీకే తూట్లు పొడిస్తే ఎలా?

Jun 5 2014 6:47 PM | Updated on Jun 4 2019 5:04 PM

తొలి హమీకే తూట్లు పొడిస్తే ఎలా? - Sakshi

తొలి హమీకే తూట్లు పొడిస్తే ఎలా?

తెలంగాణలో అన్ని రకాల పంట రుణాలను టీఆర్ఎస్ మాఫీ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో అన్ని రకాల పంట రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మొదటి హమీకే తూట్లు పొడిచేలా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఒక ఏడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న నిర్ణయాన్ని కేసీఆర్‌ పునఃపరిశీలించాలని సూచించారు. పోలవరం ముంపు ప్రాంతాల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తైన తరువాత ముంపు ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.

రైతు లందరికీ రూ.లక్ష వరకు పంటరుణాలు మాఫీ చేయాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని బీజేపీ నేతలు హైదరాబాద్ లో కోరారు. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను మాఫీ చేయాలని పోచారంకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement