సింగరేణి కార్మికులకు వరాలపై ‘జలగం’ హర్షం | K Chandrasekhar Rao: CM promises jobs to employees' dependents | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికులకు వరాలపై ‘జలగం’ హర్షం

Sep 30 2017 3:07 AM | Updated on Sep 2 2018 4:19 PM

K Chandrasekhar Rao: CM promises jobs to employees' dependents - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాలు ప్రకటించడం పట్ల కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు హర్షం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి, ఇతర నాయకులతో కలసి కేసీఆర్‌ మీడియా సమావేశాన్ని పూర్తిగా వీక్షించారు. అనంతరం సీఎం ప్రకటించిన వరాలకి హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. సెంట్రల్‌ వర్క్‌ షాప్, హెడ్‌ ఆఫీస్‌ల వద్ద బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement