హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నడుపనున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నడుపనున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఆరు రాత్రులు, ఏడు పగళ్లు ఉండే ఈ యాత్రా స్పెషల్ ట్రైన్ (17016) ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 30వ తేదీ సాయంత్రం 5.40 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ (17015) డిసెంబర్ 4న ఉదయం 8.35 గంటలకు బయలుదేరి 5న ఉదయం 7.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. పర్యటనలో సుప్రసిద్ధ పూరీజగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయాల సందర్శన ఉంటుంది. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 040-27702407, 9701360647 నంబర్లలో సంప్రదించవచ్చు.
ధారూర్‌కు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ధారూర్ మెథడిస్ట్ చర్చిలో జరిగే క్రిస్టియన్ జాతరకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్-ధారూర్ (07023) స్పెషల్ రైలు ఈ నెల 14, 16 తేదీ ల్లో ఉదయం 5.30 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ధారూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ధారూర్-హైదరాబాద్ (07024) స్పెషల్ రైలు ఈ నెల 14, 16 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు ధారూర్ నుంచి బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు జామున 3 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి, వికారాబాద్, సదాశివపేట్, కోహీర్, జహీరాబాద్, బీదర్ స్టేషన్లలో రైలు ఆగుతుంది.