పేదలకు వ్యక్తిగత రేషన్‌కార్డులు | Individual ration cards to the poor | Sakshi
Sakshi News home page

పేదలకు వ్యక్తిగత రేషన్‌కార్డులు

Sep 16 2014 2:19 AM | Updated on Mar 21 2019 8:35 PM

పేదలకు రేషన్ సరఫరా కోసం వ్యక్తిగత రేషన్‌కార్డులు జారీ చేయాలని దీని ద్వారా వ్యక్తి వలస వెళ్లిన ప్రాంతంలో కూడా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు.

హన్మకొండ అర్బన్ : పేదలకు రేషన్ సరఫరా కోసం వ్యక్తిగత రేషన్‌కార్డులు జారీ చేయాలని దీని ద్వారా వ్యక్తి వలస వెళ్లిన ప్రాంతంలో కూడా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు. నవంబర్ నుంచి ప్రభుత్వం చేపట్టే కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల జారీ, నిరు పేదలకు ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లతో సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పథకాల అమలు కోసం కలెక్టర్ల అభిప్రాయాలు అడిగారు.
 
లబ్ధిదారులకు వలస వెళ్లిన చోట రేషన్ సరుకులు
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా పథకాల అమలులో పారద్శకత కోసం రేషన్ సరుకుల పంపిణీ ఆన్‌లైన్ విధానం ద్వారా చేయాలని, డ్రైవింగ్ లెసైన్స్, పాన్‌కార్డు, ఏటీఎం, ఆధార్‌కార్డుల మాదిరిగా పేదలకు ఒక్కొక్కరికీ ఒక కుటుంబ సరఫరా కార్డు ఇవ్వాలని తద్వారా వారు ఎక్కడ ఉంటే అక్కడ రేషన్ సరుకులు పొందే వెసులు బాటు ఉంటుందని అన్నారు. కలెక్టర్ సూచనలను విన్న రేమండ్ పీటర్ కిషన్‌ను అభినందించారు. పింఛన్‌కు కుటుంబ ఆదాయం, వయస్సు నిర్ధారణకు తీసుకోవాల్సిన చర్యలు కలెక్టర్ సూచించారు.
 
 కుటుంబంలో ఒక్కరికే పింఛన్.. వికలాంగులకు మినహాయింపు

 ప్రసుత్తం పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచినందున కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇ్వవాల ని సూచించారు. వికలాంగులకు ఈ విషయం లో మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో అర్హులకు అన్యా యం జరగకుండా పక్కాగా సమాచార సేకర ణ, వాస్తవాల నిర్ధారణ చేయాలన్నారు. అనంతరం పీటర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ విషయంలో కొత్తవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ఈ విషయంలో కొంత సమయం పడుతుందని అన్నారు. జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ పాండాదాస్, డీఈఓ విజయ్‌కుమార్, డీఆర్వో సురేందర్‌కరణ్, డీఆర్‌డీఏ పీడీ శంకరయ్య, డీఎస్వో ఉషారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement