21న జహీరాబాద్‌కు షర్మిల | in this month 21st sharmila tour in zaheerabad | Sakshi
Sakshi News home page

21న జహీరాబాద్‌కు షర్మిల

Apr 17 2014 2:58 AM | Updated on Aug 8 2018 5:33 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21న జహీరాబాద్‌కు రానున్నారు.

జహీరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21న జహీరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జహీరాబాద్ చేరుకోనున్న షర్మిల, వైఎస్సార్‌సీపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ మొహియొద్దీన్, జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరఫున ప్రచారం చేయనున్నారు.

 ప్రచారంలో భాగంగా పట్టణంలో రోడ్డుషో నిర్వహించనున్న ఆమె, ఆ తర్వాత ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగించనున్నట్లు  వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement