నేనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా..

I Will Maintain As MLA Says Pidamarthi Ravi - Sakshi

టీఆర్‌ఎస్‌ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పిడమర్తి రవి

సత్తుపల్లి: ‘రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉంది.. మీ అందరికి అందుబాటులోనే ఉంటా.. నేనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా..? ఓటమి కొత్తేమీకాదు.. ఎన్నికల్లో అపజయం బాధకలిగించింది.. అయినా ఎవరికి విశ్రాంతి లేదు..’ టీఆర్‌ఎస్‌ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పిడమర్తి రవి అన్నారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు నివాసంలో ఆదివారం కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రభుత్వ పథకాలన్నీ రాబోయే రోజుల్లో మీ అందరికి అందిస్తామన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వం మనదే ఉన్నది కాబట్టి ఎక్కడ ఆయన మాట చెల్లుబాటు కాదన్నారు. 

రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామన్నారు. అప్పటి వరకు విశ్రమించేదే లేదని.. సత్తుపల్లిలో నివాసం ఉండి టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇప్పటికే ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రూ.25 కోట్లు నిధులు, రూ.10 కోట్లు సింగరేణి షేప్‌ నిధులు మంజూరు అయ్యాయని.. త్వరలో పనులు చేపడతామన్నారు. రెండు జోన్లకు నీళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పటం హాస్యాస్పదంగా ఉందని.. ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన పని చేయకుండా అడగటం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌  పట్టణ అధ్యక్షుడు చల్లగుండ్ల కృష్ణయ్య, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, వెల్ది జగన్మోహన్‌రావు, జ్యేష్ట అప్పారావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, ఎస్‌కే మోనార్క్‌ రఫీ, రవీందర్‌రెడ్డి, మారుతి బాబురావు, దొడ్డాకుల గోపాలరావు, వినుకొండ కృష్ణ, మోరంపూడి ప్రభాకర్, ఎస్‌కె జాని పాల్గొన్నారు.  

నిరంతరం ప్రజలతోనే ఉంటా
పెనుబల్లి: గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం  నిత్యం ప్రజలతోనే ఉంటానని పిడమర్తి రవి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆదివారం మొదటిసారిగా మండలానికి వచ్చిన ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.  నిత్యం ప్రజలతోనే ఉంటూ సమస్యల సాధనకే కృషి చేస్తానన్నారు. తనకు ఓటు వేసిన మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  
 
   
   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top