భార్యను చంపిన భర్త | husband murdered his wife | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్త

Feb 28 2018 6:49 AM | Updated on Jul 30 2018 8:41 PM

husband murdered his wife - Sakshi

మృతురాలు నోముల నాగమణి(ఫైల్‌ ఫోటో)

మణుగూరుటౌన్‌: కట్టుకున్న భార్యకు తోడు నీడగా ఉండాల్సిన భర్తే ఆమెపాలిట కాలయముడయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఇది సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన నోముల లింగయ్య, మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తన భార్య నాగమణి(50)ని సోమవారం రాత్రి అడిగాడు. ఆమె నిరాకరించడంతో బీరువాలో ఉన్న నగదును తీసుకునేందుకు అతడు ప్రయత్నించాడు.

ఆమె అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన లింగయ్య, పక్కనే ఉన్న కత్తితో ఆమెను పొడిచాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోఆమె  మృతిచెందింది. నాగమణిని ఆమె భర్త నోముల లింగయ్య, కోడలు నోముల అరుణ కలిసి హత్య చేశారంటూ మృతురాలి అక్క కొండ వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో మణుగూరు సీఐ మొగిలి, కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement