రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ | heavy rush in vemulawada temple | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

Feb 12 2018 5:14 PM | Updated on Mar 21 2019 7:27 PM

heavy rush in vemulawada temple - Sakshi

యాప్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

వేములవాడ:  రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకట్రామ్‌రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు– 2018 యాప్‌ను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ప్రారంభించారు.

వేములవాడ మహాశివరాత్రి జాతర అని టైప్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గుడి చెరువులో స్టేజీఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు లోకల్‌గా తిరిగేందుకు నాలుగు మినీబస్సులను ఉచితంగా తిప్పుతున్నట్లు చెప్పారు. శివరాత్రి సందర్భంగా తీసుకోవాల్సిన బందోబస్తుపై ఎస్పీ విశ్వజిత్‌కంపాటి సమీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement