త్రిశంకు స్వర్గంలో జానా భవిత: జగదీశ్‌రెడ్డి | guntakandla Jagadish Reddy takes on Jagadeesh reddy | Sakshi
Sakshi News home page

త్రిశంకు స్వర్గంలో జానా భవిత: జగదీశ్‌రెడ్డి

Jul 30 2014 3:24 AM | Updated on Sep 17 2018 4:56 PM

త్రిశంకు స్వర్గంలో జానా భవిత: జగదీశ్‌రెడ్డి - Sakshi

త్రిశంకు స్వర్గంలో జానా భవిత: జగదీశ్‌రెడ్డి

సీఎల్పీ నేత కె.జానారెడ్డి రాజకీయ భవిష్యత్, త్రిశంకుస్వర్గంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

 విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా
 నల్లగొండ: సీఎల్పీ నేత కె.జానారెడ్డి రాజకీయ భవిష్యత్,  త్రిశంకుస్వర్గంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జానా చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో జానారెడ్డి కనీసం నియోజకవర్గ ప్రజలను కూడా పట్టించుకోలేదన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆంధ్రులకు అంకితం చేసినట్లుగానే వ్యవహరించారని ఆరోపించారు. ఉస్మానియా విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, కాల్పుల కేసుల విషయంలోనూ నోరు మెదపని ఆయన ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
 
 త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్
 తెలంగాణ విద్యార్థుల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరలో నిర్వహిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఎవరి కౌన్సెలింగ్ వారు నిర్వహించుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. రుణమాఫీ విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement