నిలిచిన గూడ్స్: ఎక్స్ప్రెస్ రైళ్లకు అంతరాయం | Goods train stranded, hits rail traffic at Nalgonda district | Sakshi
Sakshi News home page

నిలిచిన గూడ్స్: ఎక్స్ప్రెస్ రైళ్లకు అంతరాయం

Mar 15 2014 9:00 AM | Updated on Aug 29 2018 4:16 PM

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే క్రాసింగ్ సమీపంలో శనివారం ఉదయం సాంకేతిక లోపంతో గూడ్స్ రైలు నిలిచిపోయింది.

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే క్రాసింగ్ సమీపంలో శనివారం ఉదయం సాంకేతిక లోపంతో గూడ్స్ రైలు నిలిచిపోయింది. దాంతో హైదరాబాద్ - కాజీపేట మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఇంటర్ సిటీ, ఏపీ ఎక్స్ప్రెస్లు భువనగిరి రైల్వే స్టేషన్లో నిలిచిపోయాయి.

 

దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూడ్స్ రైల్లో సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement