విద్యుదాఘాతంతో రైతు మృతి | former death due to electric shock in karimnagar district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jan 21 2015 6:39 PM | Updated on Sep 5 2018 2:26 PM

వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో చోటుచేసుకుంది.

వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో చోటుచేసుకుంది. బక్కసట్ల చిన్న కొమరయ్య(28) అనే రైతు మృతిచెందాడు.

వివరాలు.. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన కొమరయ్య బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం బావి దగ్గరకు వెళ్లాడు. బావిలో పూడిక తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగ కాలికి తగలడంతో రైతు చిన్న కొమరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కొమరయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement