ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పరిధిలో క్రాంతి ట్రాన్స్‌పోర్టు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్‌ను అటవీ అధికారులు పట్టుకున్నారు.
ఖమ్మం (అశ్వారావుపేట) : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పరిధిలో క్రాంతి ట్రాన్స్‌పోర్టు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్‌ను అటవీ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 వేలు ఉంటుంది.
ఫర్నీచర్‌ను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్, సహాయకులు పరారీలో ఉన్నారు. అక్రమంగా టేకు ఫర్నీచర్‌ను అశ్వారావుపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని సమాచారం అందటంతో అటవీ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.