పప్పు దినుసుల సాగుపై దృష్టి | Focus on the cultivation of pulses Cereals | Sakshi
Sakshi News home page

పప్పు దినుసుల సాగుపై దృష్టి

Apr 24 2016 1:47 AM | Updated on Sep 3 2017 10:35 PM

రైతులను ప్రత్యామ్నాయ లాభదాయ క పంటల సాగు చేసేందుకు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పత్తికి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లింపు
‘మన తెలంగాణ - మన వ్యవసాయం’లో రైతులకు అవగాహన
రేపు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ప్రారంభం

 
హన్మకొండ : రైతులను ప్రత్యామ్నాయ లాభదాయ క పంటల సాగు చేసేందుకు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతివృష్టి, అనావృష్టితో పంటలు పాడై దిగుబడులు తగ్గి మార్కెట్‌లో మద్ద తు ధర లభించక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నా రు. ఈసారి పత్తి కొనుగోళ్లు అంతర్జాతీయ మార్కెట్‌లో నిలిచేపోయే అవకాశం ఉంది. ఏదేశంలో పండిన పంటలు ఆ దేశంలోనే వినియోగించుకోవాలని ఒప్పందం జరిగింది. ఈ పరిస్థితుల్లో పత్తి సాగు విస్తీర్ణం తగ్గించాలని ప్రభుత్వం యోచి స్తోంది. ప్రభు త్వం, వ్యవసాయ శాఖ రైతులను పత్తికి ప్రత్యమ్నాయంగా పప్పు దినుసుల పంటల సాగు వైపు దృష్టిసారించే యోచనలో ఉన్నాయి. ఇందుకు శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 25వ తేదీ నుంచి మే 5 వరకు జరిగే ‘మన వ్యవసాయం - మన తెలంగా ణ’ కార్యక్రమంలో పప్పు దినుసులు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.


జిల్లాలో ఖరీఫ్‌లో పత్తి 2,47,608 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ విస్తీర్ణాన్ని తగ్గించే అదే స్థారుులో కంది, పెసర తదితర పప్పు దినుసుల పంటలు, మొక్కజొన్న సాగును గణనీయంగా పెంచాలని వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొం దించింది. పైగా జిల్లాలో పప్పుదినుసుల సాగు చాలా తక్కువ ఉంది. కంది సాధారణసాగు 11,045 హెక్టార్లు, పెసర 21,219 హెక్టార్లు, సోయాబీన్ 119 హెక్టార్లు, మినుములు 218 హెక్టార్లలో సాగవుతోంది. పప్పు దినుసులు స్థానికంగా పండిం చక పోవడంతో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ధర ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం రాయితీపై విని యోగదారులకు అందించాల్సిన పరిస్థితులు ఉ న్నారుు. నూనె గింజల పంటలు కూడా పండించేలా రైతులను అవగాహన కల్పించనున్నారు.

 జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణంలో 20శాతం తగ్గించాలని వ్యవసాయ శాఖ కార్యాచరణ తయా రు చేసింది. ఈ లెక్కన పత్తి సాధారణ విస్తీర్ణం నుంచి 49,522 హెక్టార్లు తగ్గించి ఈ మేరకు పప్పు దినుసుల విస్తీర్ణం పెంచాలని నిర్ణయించింది. ఒక శాతం కింద సోయాబీన్‌ను ప్రస్తుత సాధారణ సాగు విస్తీర్ణానికి అదనంగా 2,476 హెక్టార్లు, 7 శాతం కింద మొక్కజొన్నను సాధారణ విస్తీర్ణానికి అదనం గా 17,333 హెక్టార్లు, 5శాతం కింద కందిని సాధారణ విస్తీర్ణానికి అదనంగా 12,380 హెక్టార్లు, 6 శాతం కింద పెసరను సాధారణ విస్తీర్ణానికి అదనం గా 14,856 హెక్టార్లు, ఒక శాతం పెంపు కింద మినుములను సాధారణ విస్తీర్ణానికి అదనంగా 2,476 హెక్టార్లలో పండించాలని ప్రణాళిక రూపొందించిం ది.

జాతీయ ఆహారభద్రత మిషన్ కింద పప్పు దినుసులు, నూనె గింజలు, మొక్కజొన్న పంటల సాగు ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మన తెలంగాణ - మన వ్యవసాయంలో వీటితోపాటు నేల ఆరోగ్యం, ఎరువులు, విత్తనాలు, సస్యరక్షణ చర్యలు, పంట రుణాలు, బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, ఉద్యా న పంటలు, మార్కెంటింగ్ అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమంలో కార్యక్రమం ప్రతి మండలంలో ప్రతి రోజు రెండు, నుంచి మూడు గ్రామాలలో సమావేశాలు నిర్వహించనున్నారు. పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్ర మ శాఖ, మత్స్యశాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 25వ తేదీన ఉదయం 7 గ ంటలకు హసన్‌పర్తి మండలం మడిపల్లిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement