జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం | six killed in jadcharla road accident | Sakshi
Sakshi News home page

జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

Nov 11 2017 7:14 PM | Updated on Aug 30 2018 4:15 PM

five killed in jadcharla road accident - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. జడ్చర్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరొకరు చనిపోవటంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉదండాపూర్‌ గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు దుర్మరణం చెందిన విషయం విదితమే.

కాగా, రహదారిపై అండర్ గ్రౌండ్ బిడ్జి నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ జాతీయ రహదారిపై స్థానికులు రాస్తారోకోకు దిగారు. దీంతో హైవేపై ఎటు చూసినా కిలోమీటరు మేర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కాగా ప్రమాద బాధితులంతా గంగాపూర్‌ గ్రామంలో పత్తి తీయటానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం. మృతులను బాలమ్మ (66) లక్ష్మమ్మ (50) నాగమణి (30) రంగమ్మ (60)గా గుర్తించారు. మృతుల్లో ఆటో డ్రైవర్ సహా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement
 
Advertisement
Advertisement