ఉల్లిపాయ కోసం గొడవ | Fighting For Onion At Hyderabad | Sakshi
Sakshi News home page

ఉల్లిపాయ కోసం గొడవ

Jan 1 2020 4:14 AM | Updated on Jan 1 2020 4:14 AM

Fighting For Onion At Hyderabad - Sakshi

హైదరాబాద్‌: ఉల్లిపాయల కోసం ఆటో డ్రైవర్, పానీ పూరి నిర్వాహకుడి మధ్య జరిగిన వాగ్వివాదం కాస్తా గొడవకు దారితీసింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చే సుకుంది. రహమత్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ వీరన్న, ఎస్‌ఆర్‌నగర్‌ సమీపం లోని బాపూనగర్‌లో ఉన్న చాట్‌బండార్‌లో పా నీపూరి తిన్నాడు. పానీపూరి తింటూ ఉల్లిపాయ ఎందుకు వేయలేదని వీరన్న ప్రశ్నిం చాడు. ‘ఉల్లిపాయలు వేసేందుకు బిర్యానీకి ఏమైనా ఆర్డర్‌ ఇచ్చావా’ అంటూ చాట్‌బండార్‌ నిర్వాహకుడు సర్దార్‌ పవార్‌ హేళనగా మాట్లాడాడు.

రూ.10 పానీపూరి తిన్న వీరన్న ఉల్లిపాయ వేయనందున డబ్బులు ఇచ్చేది లేదని చెప్పాడు. ఉల్లి ధర పెరిగినందున ఎవరికీ వేయటం లేదని పవార్‌ బదులిచ్చాడు. పవార్‌ మాటలు పట్టించుకోకుం డా వీరన్న అక్కడి నుండి వెళ్తుండగా, ఆగ్రహం తో పవార్‌ వీరన్నపై చేయి చేసుకున్నాడు. దీంతో వీరన్న ఇనుపరాడ్‌ తీసుకుని పవార్‌ తల పగుల గొట్టాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement