కూతుర్ని కాపురానికి తీసుకెళ్లడంలేదని .. | father in law takes on sister in law in nalgonda district | Sakshi
Sakshi News home page

కూతుర్ని కాపురానికి తీసుకెళ్లడంలేదని ..

Jun 12 2016 11:25 AM | Updated on Sep 4 2017 2:20 AM

కాపురానికి తీసుకెళ్లకుండా.. తన కుమార్తెను నానా ఇబ్బందుల పాలు చేస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తండ్రి వియ్యంకుడిపై విరుచుకుపడ్డాడు.

నల్లగొండ : కాపురానికి తీసుకెళ్లకుండా.. తన కుమార్తెను నానా ఇబ్బందుల పాలు చేస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తండ్రి వియ్యంకుడిపై విరుచుకుపడ్డాడు. వియ్యంకుడి కాలును తన కాలుకు కట్టేసుకుని... పెద్ద మనుషుల వద్దకు తీసుకెళ్లి ...  నిలదీశాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలం గుడివాడలో ఆదివారం  చోటుచేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి..... గ్రామానికి చెందిన సైదులు (25)కు అదే గ్రామానికి చెందిన రాచకొండ సరిత (21) తో రెండేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజులు సజావుగా సాగిన వారి కాపురంలో కూతురు పుట్టాక గొడవలు ప్రారంభమయ్యాయి. పురుడు కోసం పట్టింటికి వెళ్లిన సరితను కాన్పు అనంతరం తిరిగి మెట్టినింటి వారు వచ్చి ఎంతకు తీసుకువెళ్లలేదు. ఆ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల ఎదుట పంచాయతి నిర్వహించారు.కాని ప్రయోజనం లేకపోవడంతో.. సరిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల జోక్యంతో సైదులు తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. తాజాగా శనివారం వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భర్తతో అత్తమామలు కూడా సరితను తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితురాలు కేతెపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఇవాళ గ్రామంలో మామ కోడళ్లు ఒకరికొకరు ఎదురు పడ్డారు. దాంతో ఆగ్రహించిన సైదులు తండ్రి నా మీదే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానని బెదిరించాడు. ఇది గమనించిన సరిత తండ్రి అక్కడికి చేరుకొని వియ్యంకుడి కాలుకు తన కాలుతో కట్టేసుకొని పెద్దమనుషుల వద్దకు తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను సర్ది చెప్పే క్రమం చేస్తున్నారు.

Advertisement
Advertisement