'రుణమాఫీ జాప్యంతో రైతులు పంట బీమా కోల్పోయారు' | Farmers Crop insurance loss due to crop loan delay, says Shabbir Ali | Sakshi
Sakshi News home page

'రుణమాఫీ జాప్యంతో రైతులు పంట బీమా కోల్పోయారు'

Sep 30 2014 1:04 PM | Updated on Mar 18 2019 7:55 PM

'రుణమాఫీ జాప్యంతో రైతులు పంట బీమా కోల్పోయారు' - Sakshi

'రుణమాఫీ జాప్యంతో రైతులు పంట బీమా కోల్పోయారు'

రుణమాఫీ అమలు జాప్యం కావడంతో రైతులు పంట బీమాను కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : రుణమాఫీ అమలు జాప్యం కావడంతో రైతులు పంట బీమాను కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... తెలంగాణలో ఇప్పటివరకు బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ కింద చెల్లించాల్సిన నగదు జమ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అన్నారు. ఓ వేళ ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో ఆ నిధులు విడుదల చేసిన వాటిని ప్రాసెస్ చేయడానికి 10 రోజులు పడుతుందన్నారు.

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల వల్ల మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. ప్రభుత జాప్యం చేయడం వల్ల రైతులు పంట నష్టపరిహారాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ఈ సమస్యపై బ్యాంకర్లతోనూ, కేంద్రంతోనూ మాట్లాడి రైతు లబ్ది చేకూర్చాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. రైతాంగాన్నితీవ్రంగా కుదిపేస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement