
తన బంధువు రణధీర్ రెడ్డిని ఐటీ అధికారులమని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్ : తన బంధువు రణధీర్ రెడ్డిని ఐటీ అధికారులమని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చైతన్యపురి లిమిట్స్, జైపురి కాలనీలో నివసించే తన బంధువు రణధీర్ రెడ్డి ఇంట్లో ఆదివారం కొంతమంది సోదాలు నిర్వహించారన్నారు. ఈ సోదాల పేరిట సెల్ ఫోన్‌లు, నగదు, బంగారంతో పాటు రణధీర్ రెడ్డిని కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఐటీ అధికారుల దృష్టికి తీసుకు రాగా.. తాము ఎలాంటి సోదాలు చేయలేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారన్నారు. నిన్నటి నుంచి రణధీర్ రెడ్డి ఆచూకీ లేదని, మరోవైపు ఐటీ అధికారులు తమకు సంబంధం లేదంటున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.