చర్యలు తప్పవు

29లోగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలి

ఆ తరువాత దరఖాస్తులు రావొద్దు

వీడియోకాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) :
జిల్లాలోని ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని, బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించిన తరువాత, తాము వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటామని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఇన్‌చార్జి కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి మండల స్థాయి అధికారులను హెచ్చరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాలో సుమారు 5300 మరుగుదొడ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, మరో 1100 నిర్మాణాలు ప్రారంభం కాలేదన్నారు. ఈ నెల 29లోపు నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న గ్రా మాల్లో ఒకొక్క గ్రామానికి ఒకరిని నియమించి నిర్మాణాలు పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. పూరి గుడిసెల్లో ఉండేవారికి వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు.

బతుకమ్మ వేడుక ఘనంగా నిర్వహించాలి
బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వ హించాలని, గ్రామాలు, పట్టణాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామ సంఘాల మహిళలు, సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వా నించి సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండలాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బతుకమ్మలు నిమజ్జనం చేసే చెరువులు, కుంటల వద్ద సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ నెల 27న కలెక్టర్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ‘మహాబతుకమ్మ’కు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top