breaking news
personal toilets
-
‘మరుగు’న దోచేశారు !
బేస్తవారిపేట: ప్రతి ఇంటికి ఒక వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించి స్త్రీల ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే మహోన్నతమైన ఆశయంతో కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఆ ఆశయానికి అప్పటి టీడీపీ నాయకులు తూట్లు పొడిచారు. వారి అక్రమ వ్యవహారాలకు వ్యక్తిగత మరుగుదొడ్లనూ వదిలిపెట్టలేదు. నిర్మాణం పూర్తి చేయకుండానే మరుగుదొడ్ల బిల్లులు బొక్కేశారు. కొందరు సొంత డబ్బులతో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని కార్యాలయాల చుట్టూ బిల్లుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. స్వచ్ఛభారత్ పథకంలో నిర్మించిన మరుగుదొడ్లలో అంతులేని అవినీతి జరిగింది. గ్రామ, మండల స్థాయి టీడీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై అందిన కాడికి దోచుకున్నారు. పలుచోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు. గుంతలు, తలుపులు, సెప్టిక్ ట్యాంకులు లేని అరకొర నిర్మాణాలతో బిల్లులు నొక్కేశారు. అప్పట్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చాలా మంది లబి్ధదారులు ముందుకు రాకపోవడంతో నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అధికార పార్టీ నాయకులు పనులు చేస్తామని అవినీతికి తెరలేపారు. బేస్తవారిపేట మండలంలోని గలిజేరుగుళ్ల పంచాయతీలోని చెన్నుపల్లి, బార్లకుంట, శింగరపల్లి, బాలీశ్వరపురం గ్రామాల్లో 215 మరుగుదొడ్లు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. 85 శాతం పూర్తి కాకుండానే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించారు. రూ.లక్షల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి గుంతలు తీసి రింగులు వేశారు కానీ నిర్మాణం పూర్తి చేయలేదు. మరి కొన్నిచోట్ల నిర్మాణ పనులే మొదలు పెట్టలేదు. అసలు లబి్ధదారులకు తెలియకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు. పాతవాటిని కొత్తగా చూపించారు. దొరికినకాడికి దోచుకుని పంచుకు తిన్నారు. కోనపల్లె పంచాయతీలోని పోగుళ్లలో పూరిపాకల్లో జీవనం సాగిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పక్కా గృహం లేదు. 45 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. పొడవు, వెడల్పు తక్కువగా, లోతు తక్కువగా గుంత తీసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకున్నారు. గ్రామంలో ఒక్కరు కూడా వ్యక్తిగత మరుగుదొడ్డిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. అవి నిరుపయోగంగా మారాయి. రూ.లక్షలు ఖర్చుపెట్టిన ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. కాంట్రాక్టర్ జేబులు నింపడానికే పథకం ఉపయోగపడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పంచాయతీల్లో రూ.25 లక్షలుపైగానే అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరుగుదొడ్లను ఉపయోగించే పరిస్థితి లేదు మరుగుదొడ్లను సక్రమంగా నిర్మించలేదు. లోతు తక్కువగా రెండు–మూడు రింగులు వేసి నిర్మాణ పనులు పూర్తి చేశారు. స్నానం చేసేందుకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దీంతో నిర్మించిన మరుగుదొడ్లను ఉపయోగించడం లేదు. -దొర తిరుపతమ్మ, పోగుళ్ల నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నారు.. వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైంది. పనులు చేస్తామన్నా కాంట్రాక్టర్ గుంత తీసి రింగులు వేశారు. నిర్మాణ పనులు చేపట్టలేదు. అధికారుల జాబితాలో నిర్మాణం పూర్తయి నిధులు డ్రా చేసినట్లు ఉంది. గలిజేరుగుళ్ల పంచాయతీలో ఎక్కువ శాతం లబి్ధదారుల పరిస్థితి ఇదే. -ముత్తుముల రమాదేవి, శింగరపల్లె పనులు పూర్తి చేయకుండానే రూ.15 వేలు తీసుకున్నారు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పనులు నేనే చేయిస్తానని తెలిపాడు. జేసీబీతో గుంతను తీయించాడు. అందులో రింగులు వేయించాడు. అవసరమైన పత్రాలు, వేలిముద్రలు తీసుకున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేయకుండానే వదిలివేశారు. కానీ ఆన్లైన్లో నిర్మాణం పూర్తి చేసి, రూ.15 వేలు చెల్లించినట్లు ఉంది. -గువ్వా రాజమ్మ, శింగరపల్లె లబ్ధిదారులకు న్యాయం చేస్తాం.. నిర్మాణాలు పూర్తి చేయకుండానే నిధులు విడుదల చేయడంపై క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాం. రెండు గ్రామాల్లో లబి్ధదారుల జాబితా ప్రకారం పంచాయతీ కార్యదర్శితో ఇంటింటి సర్వే చేయిస్తాం. నేను రాకముందు జరిగిన నిర్మాణాలపై పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. కె.కవితాచౌదరి, ఎంపీడీఓ, బేస్తవారిపేట -
చర్యలు తప్పవు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : జిల్లాలోని ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని, బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించిన తరువాత, తాము వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటామని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఇన్చార్జి కలెక్టర్ రవీందర్రెడ్డి మండల స్థాయి అధికారులను హెచ్చరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో సుమారు 5300 మరుగుదొడ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, మరో 1100 నిర్మాణాలు ప్రారంభం కాలేదన్నారు. ఈ నెల 29లోపు నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న గ్రా మాల్లో ఒకొక్క గ్రామానికి ఒకరిని నియమించి నిర్మాణాలు పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. పూరి గుడిసెల్లో ఉండేవారికి వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. బతుకమ్మ వేడుక ఘనంగా నిర్వహించాలి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వ హించాలని, గ్రామాలు, పట్టణాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామ సంఘాల మహిళలు, సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వా నించి సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండలాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బతుకమ్మలు నిమజ్జనం చేసే చెరువులు, కుంటల వద్ద సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ నెల 27న కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించనున్న ‘మహాబతుకమ్మ’కు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
మీకు సిగ్గూ, శరం ఉందా!
–డ్వామా సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఫైర్ –వ్యక్తిగత మరుగుదొడ్ల పురోగతి లేదు – పూర్తయిన వాటికి డబ్బులు ఇవ్వరు – ఇలాగైతే సస్పెండ్ చేస్తా – జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(హాస్పిటల్): ‘వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి లేదు. పూర్తయిన వాటికీ జియోట్యాగింగ్ చేయడం లేదు. వారికి బిల్లులు చెల్లించడం లేదు. మీ శాఖలో ఇంత మంది ఉన్నారు ఎందుకు..? మీకసలు సిగ్గూ, శరం ఉందా...!’ అని డ్వామా సిబ్బందిపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మండిపడ్డారు. బహిరంగ మలవిసర్జనలేని గ్రామాలను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఓడీఎఫ్ గ్రామాలపై సీఆర్పీలతో జిల్లా కలెక్టర్ బుధవారం సునయన ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్∙విజయమోహన్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహిస్తానని, అప్పుడు ఎవరైనా వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు పెండింగ్ పెట్టుకుని, జియోట్యాగింగ్ చేయకుండా వంటి కారణాలతో వస్తే ఇక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రోత్సహించే సీఆర్పీలకు ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. మొదటి బ్యాచ్లో ఉన్న వారికి పారితోషికాన్ని రోజుకు రూ.400 నుంచి రూ.500 కు పెంచుతున్నట్లు ప్రకటించారు. 50 శాతం ఓడీఎఫ్ గ్రామాలు దాటితే మరింత పారితోషికం పెంచుతామన్నారు. వ్యక్తిగత ప్రతిభను బట్టి సీఆర్పీలకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. వితంతువులు, వికలాంగులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కష్టపడి, చిత్తశుద్ధితతో పనిచేయాలని హితవు పలికారు. సమావేశంలో ఏపీడీ సులోచన, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు.