విద్యుదాఘాతంతో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది.
హైదరాబాద్: విద్యుదాఘాతంతో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి నగరంలోని మలక్‌పేట రైల్వేస్టేషన్‌లో జరిగింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి మృతురాలి వివరాల కోసం గాలిస్తున్నారు.