వెనుకబడిపోయాం! | Education Department Does Not Care About Children Staying Away From School | Sakshi
Sakshi News home page

వెనుకబడిపోయాం!

Oct 3 2019 3:49 AM | Updated on Oct 3 2019 5:24 AM

Education Department Does Not Care About Children Staying Away From School - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బడి మానేసిన, బడికి దూరంగా ఉంటున్న పిల్లలను విద్యాశాఖ పెద్దగా పట్టించుకోవడం లేదు. బడి బయటెంత మంది పిల్లలు ఉంటున్నారన్న విషయంలోనూ పెద్దగా దృష్టి పెట్టడం లేదని తేలింది. దేశంలో 20 పెద్ద రాష్ట్రాలతో పోలి్చతే బడి బయటి పిల్లలను బడుల్లో చేరి్పంచిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 19వ స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ విడుదల చేసిన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిటీ ఇండెక్స్‌ స్పష్టం చేసింది. 2015–16, 2016–17 విద్యా సంవత్సరాల పరిస్థితులను పోల్చుతూ నీతి ఆయోగ్‌ నివేదికను రూపొందించి ఇటీవల విడుదల చేసింది. రాష్ట్రంలో 2016–17 విద్యాసంవత్సరంలో బడి బయటున్న పిల్లల్లో కేవలం 21.9 శాతం మందినే గుర్తించినట్లు తేలి్చంది. అదే 2015–16 విద్యా సంవత్సరంలో కేవలం 12.5 శాతం మందినే గుర్తించారని పేర్కొంది.

మరోవైపు సింగిల్‌ టీచర్‌ స్కూళ్ల సంఖ్య 2015 కంటే 2016లో పెరిగిందని స్పష్టం చేసింది. మొత్తంగా దేశంలోని 20 పెద్ద రాష్ట్రాలతో పోల్చితే ఓవరాల్‌ పర్‌ఫార్మెన్స్‌లో తెలంగాణ 18వ స్థానానికి పరిమితమైందని నీతి ఆయోగ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిటీ ఇండెక్స్‌ తేలి్చంది. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన విద్యాశాఖ సమాచారం ఆధారంగా 30 అంశాల్లో రాష్ట్రంలోని పరిస్థితిని నీతి ఆయోగ్‌ అంచనావేసింది. 2015లో 34.7 శాతం స్కోర్‌తో 17వ స్థానంలో ఉన్న తెలంగాణ 2016లో 39 శాతానికి స్కోర్‌ను పెంచుకున్నా ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోయింది. దీంతో 18వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఓవరాల్‌ పర్‌ఫార్మెన్స్‌లో 82.2 శాతం స్కోర్‌తో కేరళ ప్రథమ స్థానంలో ఉంది.

నివేదికలోని మరికొన్ని ప్రధాన అంశాలు..
►రాష్ట్రంలో సింగిల్‌ టీచర్‌ స్కూళ్ల సంఖ్య పెరిగింది. సింగిల్‌ టీచర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జార్కండ్‌ మొదటి స్థానంలో ఉం డగా, తెలంగాణ మూడో స్థానంలో ఉంది. సింగిల్‌ టీచర్లున్న స్కూళ్ల సంఖ్య 11.8 శాతం నుంచి 12.6 శాతానికి పెరిగింది.  

►ఇటు ప్రధానోపాధ్యాయులు లేని స్కూళ్ల సంఖ్య పెరిగింది. 2015లో ప్రధానోపాధ్యాయులు లేని పాఠశాలలు 15.2 శాతం ఉండగా, అది 2016లో 35.3 శాతానికి పెరిగినట్లు తేల్చింది.

►2015 విద్యా సంవత్సరంతో పోలి్చతే 2016లో అభ్యసన ఫలితాలు తగ్గిపోయాయి. అది 55.9 శాతం నుంచి 43.9 శాతానికి తగ్గాయి.

►టీచర్లకు శిక్షణివ్వడంలో రాష్ట్ర విద్యాశాఖ చివరి స్థానంలో ఉంది. 2016లో కేవలం 21.1 శాతం మందికి మాత్రమే శిక్షణ æఇచ్చింది. మిగతా రాష్ట్రాల్లో ఇది 40 శాతానికి పైగా ఉంది.

►కంప్యూటర్‌ విద్యలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడింది. రాష్ట్రంలోని 11.8 శాతం స్కూళ్లలోనే కంప్యూటర్‌ ల్యాబ్‌లున్నాయి. అదే కేరళలో 50 శాతం స్కూళ్లలో, హరియాణాలో 67 శాతం స్కూళ్లలో కంప్యూటర్‌ ల్యాబ్‌లున్నాయి. రాష్ట్రంలో కేవలం 5.2 శాతం స్కూళ్లలోనే కంప్యూటర్‌ ఎయిడ్‌ లెరి్నంగ్‌ కొనసాగుతున్నట్లు తేలి్చంది.

►రాష్ట్రంలోని 43.6 శాతం ఉన్నత పాఠశాలల్లోనే సైన్స్, మ్యాథ్స్, సోషల్‌ టీచర్లున్నారు. 2015తో పోలి్చతే వీటి సంఖ్య 1.4 శాతం తగ్గింది.  

►ప్రాథమిక పాఠశాలల నుంచి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 2015లో 98.2 శాత ముండగా, 2016లో అది 92.5 శాతానికి తగ్గింది.

►ఉపాధ్యాయ విద్యా కాలేజీల్లో అధ్యాపక ఖాళీల విషయంలో తెలంగాణ 19వ స్థానంలో ఉంది. 36 శాతం పోస్టులను మాత్రమే భర్తీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement