కోడ్‌ ఉల్లంఘనపై విచారణకు ఈసీ ఆదేశం  | EC command to inquire into code violation | Sakshi
Sakshi News home page

కోడ్‌ ఉల్లంఘనపై విచారణకు ఈసీ ఆదేశం 

Published Sat, Sep 29 2018 2:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

EC command to inquire into code violation - Sakshi

ఏనుగు రవీందర్‌రెడ్డి

సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈసీ విచారణకు ఆదేశించింది. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షలు ఇస్తానంటూ రవీందర్‌రెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజీల ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

విచారణ జరిపి నివేదిక పంపిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షలు ఇస్తానంటూ వాగ్దానం చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి సురేందర్‌ తదితరులు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీడియో ఫుటేజీని జతచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement