ఏం చేద్దాం..

ఏం చేద్దాం.. - Sakshi


- కార్మికుల సమ్మెపై డిప్యూటీ సీఎం శ్రీహరి ఆరా

- వేతనాల పెంపుపై కమిషనర్‌తో సమాలోచనలు

- ‘గ్రేటర్’ ఆర్థిక పరిస్థితులపై చర్చ

- రూ.వెయ్యి పెంచేందుకు బల్దియా సిద్ధం?

వరంగల్ అర్బన్ :
కార్మికుల సమ్మెతో మహా నగరంలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం ఎట్టకేలకు జోక్యం చేసుకుంది. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరికి కమిషనర్ నివేదిక సమర్పించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె.. గ్రేటర్ అర్థిక పరిస్థితి, కార్మికుల డిమాండ్లు, మహా నగరంలో చెత్త, మురుగు సమస్యలపై సమాలోచనలు చేశారు.  



బల్దియాకు ప్రతి ఏటా ఆస్తి పన్ను రూపంలో జమ అవుతున్న సొమ్మును మాత్రమే ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలుగా అందించాల్సి ఉందని కమిషనర్ వివరించారు. గత ఏడాది పన్నుల టార్గెట్ రూ. 40 కోట్లు ఉండగా, రూ. 38 కోట్లు వసూలయ్యూయన్నారు. గ్రేటర్ పరిధిలో 2,994 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిపై వివిధ విభాగాల్లో విధులు నిర్త్రిస్తున్నారని... ఏడాదికి వేతనాల రూపంలో వీరికి ప్రస్తుతం రూ.40.74 కోట్లు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికుల డిమాండ్ మేరకు కనీస వేతనాలను పెంచితే బల్దియాపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు.



ప్రస్తుతం ఉన్న వేతనానికి అదనంగా రూ.వెరుు్య పెంచితే ఏడాదికి రూ.45 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, రూ.2వేలు పెంచితే రూ.50 కోట్లు, రూ.3వేలు పెంచితే రూ. 55 కోట్లు పంపిణీ చేయాలని వివరించారు. ఇంత మొత్తంలో చెల్లించలేమని, ఒక్కో కార్మికుడికి రూ.వెరు్య చొప్పన వేతనాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కడియం శ్రీహరికి కమిషనర్ వివరించినట్లు సమాచారం. 2015-16 బడ్జెట్‌లో నగర ప్రజలపై ఎలాంటి ఆస్తి భారం మోపకుండా అంచనాలను రూపొందించామని,  ఈ నేపథ్యంలో కార్మికులకు కనీస వేతనాలను పెంచడం బల్దియాపై పెనుభారమేనని కమిషనర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.



ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా బల్దియా ఆర్థిక పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు బల్దియూ అధికార వర్గాలు చెబుతున్నారుు. మహా నగరంలో చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోతోందని, మురుగు నీరు నిలవడంతో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఉన్నాయని, ఆ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. పర్మినెంట్ కార్మికులు ప్రధాన రహదారుల్లో చెత్తను మడికొండ డంప్ యార్డుకు తరలిస్తున్నారని, కొంత మంది దినసరి కూలీలలను విధుల్లోకి తీసుకున్నట్లు కమిషనర్ ఆయనకు వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top