విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతి | Degree student dies of Fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతి

Aug 27 2015 5:05 PM | Updated on Aug 17 2018 2:53 PM

విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమునపల్లి మండలం నిల్వాల్ గ్రామంలో గురువారం జరిగింది.

వేమునపల్లి (ఆదిలాబాద్) : విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమునపల్లి మండలం నిల్వాల్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. నిల్వాల్ గ్రామానికి చెందిన ఎస్. శిల్ప(20) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement