‘ఐసీడీఎస్‌లో సూపర్‌వైజర్‌ అర్హత డిగ్రీనే’ 

Degree Qualification For ICDS Supervisor Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమ గ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌)లో సూపర్‌వైజర్‌ (గ్రేడ్‌–2) పోస్టులను పూర్తిస్థాయిలో పదోన్నతుల ద్వారానే ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు సోమవారం ఆ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పదోన్నతుల విషయంలో అంగన్‌వాడీ టీచర్ల అర్హతల నిబంధనల్లో కాస్త ఊరట కలగనుంది. అంగన్‌వాడీ టీచర్లలో అనుభవజ్ఞులు, అర్హత కలిగిన వారినే సూపర్‌వైజర్లు (గ్రేడ్‌–2)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ..వారి విద్యార్హత కనీసం డిగ్రీ ఉండాల్సిందిగా పేర్కొంది. క్షేత్రస్థాయిలో డిగ్రీ చదివిన వారు అతి తక్కువ మంది ఉండటంతో ప్రభుత్వానికి పలు వినతులు అందాయి. డిగ్రీ అర్హత కాకుండా పదోతరగతిని ప్రామాణికంగా తీసుకోవాలని మెజార్టీ టీచర్లు కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పదోతరగతి అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తామని కానీ, ఐదేళ్లలో డిగ్రీ  పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top