భూసేకరణ బిల్లుకు సవరణను ఆపండి | cpm letter to president for land Acquisition Act | Sakshi
Sakshi News home page

భూసేకరణ బిల్లుకు సవరణను ఆపండి

Dec 28 2016 2:17 AM | Updated on Aug 13 2018 8:12 PM

ప్రతిష్టాత్మక భూసేకరణ చట్టం–2013కు తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం మండిపడింది.

రాష్ట్రపతికి సీపీఎం వినతిపత్రం
రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక భూసేకరణ చట్టం–2013కు తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం మండిపడింది. ఆ చట్టానికి సవరణలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించింది. ఈ అంశంపై జోక్యం చేసుకుని భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఉపసంహరిం చుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలంటూ.. పార్టీ నాయకులు సీహెచ్‌ సీతారాములు, సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి, డీజీ నర్సింహారావు, నంద్యాల నర్సింహారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి తదితరులు మంగళవారం రాష్ట్రపతిప్రణబ్‌ ముఖర్జీకి వినతి పత్రం సమర్పించారు.

అనంతరం ఎంబీ భవన్‌లో సారంపల్లి మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతులు, నిర్వాసితులు, వృత్తి దారులు, పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం–2013ని తీసుకువచ్చిం దని ఆయన చెప్పారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలో తొక్కి.. గుజరాత్‌ తరహాలో భూసేకరణ చట్టం రూపొందించి, అసెంబ్లీలో ప్రతిపాదించడం శోచనీయమన్నారు.

కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
భూసేకరణ చట్టం–2013ని య«థా విధిగా అమలు చేయాలని, సవరణలు చేయ వద్దని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ లేఖ రాశారు. గుజరాత్‌ తరహా భూసేకరణ చట్టం తీసుకొస్తే నిర్వాసి తులకు తీవ్ర నష్టం కలుగజేస్తుంద న్నారు. ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణకు చట్టం అడ్డం కిగా ఉందని సవరణ చేయాలనుకోవడం ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement