ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ పట్టణంలో కోర్టు భవనాల సముదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, హైకోర్టు పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ సీతారామమూర్తి శనివారం ఉదయం ప్రారంభించారు.
అసిఫాబాద్: ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ పట్టణంలో కోర్టు భవనాల సముదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, హైకోర్టు పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ సీతారామమూర్తి శనివారం ఉదయం ప్రారంభించారు. రూ.89 లక్షలతో కోర్టు భవనాలను ఇక్కడ నిర్మించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.
శివాలయంలో హైకోర్టు జడ్జి పూజలు
ఆదిలాబాద్ జిల్లా రెబ్బిన మండలం నంబాల గ్రామంలో ఉన్న శివాలయంలో హైకోర్టు జడ్జి చంద్రయ్య శనివారం ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ పూజారి, గ్రామ పెద్దలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రసాదాలు అందజేశారు.