శివయ్యను తాకిన సూర్య కిరణాలు.. పెదపులివర్రులో అపురూప దృశ్యం​​​​​​​

Sunrays Touches Lord Shiva Idol Feet Bhattiprolu Sivalayam - Sakshi

పెదపులివర్రు (భట్టిప్రోలు/గుంటూరు): భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువైన బాలా త్రిపుర సుందరీ సమేత రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం స్వామి వారి లలాటాము, అమ్మవారి పాదాల కింద సూర్య కిరణాలు తాకాయి. ఉదయం 6:40 గంటల నుంచి 16 నిముషాల పాటు ఈ కిరణాలు ప్రసరించాయి. దీనినే షోడశ కళలు అని పేర్కొంటారని వేద బ్రాహ్మణుడు ఆమంచి సృజన్‌ కుమార్‌ తెలిపారు.

ఈ దేవాలయంలో సూర్య కిరణాలు సంవత్సరంలో మే, జూన్, జూలై, ఆగస్టు నాలుగు నెలలు సూర్య కిరణాలు ప్రసరిస్తాయన్నారు. సూర్యుడు మేష రాశి నుంచి ప్రవేశించినప్పుడు ఒక సారి, వృషభ రాశిలో ఒకసారి, మిథున రాశిలో ఒక మారు, కర్కాటక రాశిలో ఒక సారి కిరణాలు ప్రసరిస్తాయన్నారు. ఈదృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.  
(చదవండి: మంగళగిరిలో 51 అడుగుల పరమ శివుడి విగ్రహం.. ఆవిష్కరించిన దత్తన్న)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top