breaking news
sunrays
-
శివయ్యను తాకిన సూర్య కిరణాలు.. పెదపులివర్రులో అపురూప దృశ్యం
పెదపులివర్రు (భట్టిప్రోలు/గుంటూరు): భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువైన బాలా త్రిపుర సుందరీ సమేత రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం స్వామి వారి లలాటాము, అమ్మవారి పాదాల కింద సూర్య కిరణాలు తాకాయి. ఉదయం 6:40 గంటల నుంచి 16 నిముషాల పాటు ఈ కిరణాలు ప్రసరించాయి. దీనినే షోడశ కళలు అని పేర్కొంటారని వేద బ్రాహ్మణుడు ఆమంచి సృజన్ కుమార్ తెలిపారు. ఈ దేవాలయంలో సూర్య కిరణాలు సంవత్సరంలో మే, జూన్, జూలై, ఆగస్టు నాలుగు నెలలు సూర్య కిరణాలు ప్రసరిస్తాయన్నారు. సూర్యుడు మేష రాశి నుంచి ప్రవేశించినప్పుడు ఒక సారి, వృషభ రాశిలో ఒకసారి, మిథున రాశిలో ఒక మారు, కర్కాటక రాశిలో ఒక సారి కిరణాలు ప్రసరిస్తాయన్నారు. ఈదృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. (చదవండి: మంగళగిరిలో 51 అడుగుల పరమ శివుడి విగ్రహం.. ఆవిష్కరించిన దత్తన్న) -
మూడో రోజూ భక్తులకు నిరాశ
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామి భక్తుల కోరిక మూడో రోజు కూడా నెరవేరలేదు. ఆకాశం మేఘా వృతమై ఉండటంతో సూర్యభగవానుని కిరణాలు ఆలయంలోని మూలవిరాట్టుపై ప్రసరించలేదు. దీంతో ఆ మహద్ఘట్టాన్ని తిలకించే అవకాశం లేక భక్తులు నిరాశ చెందారు. -
సూర్యదేవుని పాదాలను తాకిన కిరణాలు
శ్రీకాకుళం(అరసవల్లి): అరసవెల్లిలోని సూర్యదేవుని పాదాలను మంగళవారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సుమనోహర దృశ్యాన్ని చూసిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వానికి గురయ్యారు.