
సాక్షి , నల్లగొండ: సొంత ఊరికి కాలినడకన బయలుదేరారు ఆ దంపతులు. చంటి బిడ్డను భుజానేసు కుని.. రోడ్డువెంట నడుచుకుంటూ హైదరాబాద్ నుంచి పిడుగురాళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో కూలి నాలి చేసి జీవిస్తున్న వీరికి లాక్‌డౌన్ కారణంగా పనులు దొరకడంలేదు. ఈ నెల 14వ తేదీ వరకు అక్కడే ఉండి ఎలాగోలా గడిపారు. లాక్‌డౌన్ సడలించకపోవడం, పూట గడవడం కష్టంగా మారడంతో తమ సొంత ఊరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాళ్లకు తమ బిడ్డను ఎత్తుకుని కాలినడకన బయలుదేరారు. మూడు రోజుల క్రితం వీరు ఎల్బీనగర్‌లో నుంచి నడుచుకుంటూ ఆదివారం నల్లగొండకు చేరుకున్నారు. వీరిని పట్టణంలో పోలీసులు పలకరించివాకబు చేశారు. ఆహారం, బ్రెడ్ ప్యాకెట్లు అందజేసి మానవతను చాటుకున్నారు.(కరోనా నుంచి తప్పించుకున్నా చావడం ఖాయం)