గాంధీలో వైద్యులపై దాడి

Corona Positive Patient Deceased In Gandhi Hospital Doctors Attacked By Relatives - Sakshi

బాత్‌రూమ్‌లో జారిపడి కరోనా బాధితుడి మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువుల ఆగ్రహం

జూనియర్‌ డాక్టర్లపై దాడి.. కిటికీలు, ఫర్నిచర్‌ ధ్వంసం

ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించిన సీపీ అంజనీకుమార్‌

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వారికీ కరోనా పాజిటివ్‌ కావడంతో ఛాతీ ఆస్పత్రికి తరలింపు

దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం: మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌/గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆస్పత్రిలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కరోనా బాధితుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతడి బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్‌ డాక్టర్లపై దాడికి దిగారు. కిటికీ అద్ధాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేశారు. అతడు బాత్‌రూమ్‌లో జారి పడటం వల్లే మృతిచెందాడని తాము చెప్పినప్పటికీ వారు వినకుండా దాడికి దిగారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మృతుడితోపాటు దాడి చేసిన వారికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. అనంతరం దాడికి దిగిన వారిని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి తరలించారు.

అసలేమైందంటే?:
మర్కజ్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి (56)ని కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో చికిత్స కోసం వారం రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి ఐసీ యూ ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అతడితోపాటు సోదరుడు సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆస్పత్రిలో చేరారు. వీరందకీ వైద్యులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ తేలింది. మొదట చేరిన వ్యక్తి (56) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం గా ఉంది. దీంతో వైద్యులు ఎప్పటి కప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అతడి బంధువులకు వివరిస్తూనే ఉన్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల సమ యంలో బాధితుడు ఒక్కరే ఐసోలేషన్‌ వార్డులోని బాత్‌రూమ్‌కు వెళ్లాడు. ప్రమా దవశాత్తు కాలు జారి కిందపడి మృతి చెందారు. డ్యూటీలో ఉన్న వైద్యులు ఇదే అంశాన్ని అక్కడే ఉన్న మృతుడి సోదరు డు, ఇతర బంధువులకు వివరించారు. వారు ఇదేమీ పట్టించుకోకుండా వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాధితుడు చనిపోయాడని ఆగ్రహించారు. విధి నిర్వహణలో ఉన్న రెసిడెంట్‌ డాక్టర్‌ వేణు, డాక్టర్‌ వికాస్‌లపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఐసోలేషన్‌ వార్డులోని కిటికి అద్దాలు ధ్వంసం చేశారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను చెల్లాచెదురు చేశారు.
 
ఔట్‌ పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చినా..
ఇదే సమయంలో మరికొంత మంది వైద్యులు ఆస్పత్రి ఔట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారమి చ్చారు. కరోనా బాధితులున్న ఐసోలేషన్‌ వార్డులోకి వచ్చేందుకు తమకు అనుమతి లేదని చెప్పి, వారు అక్కడికి వచ్చేందుకు నిరాకరించారు. ఆస్పత్రి సూపరింటెండెం ట్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే డీఎంఈకి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సీపీ అంజన్‌కుమార్‌ వెంటనే గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి కూడా కరోనా పాజిటివ్‌ ఉండటంతో ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రిలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

భయాందోళనలో వైద్య సిబ్బంది
ఐసోలేషన్‌ వార్డులో వైద్యులపై రోగి త రఫు బంధువులు దాడికి దిగటంతో ఐసీ యూ, ఐసోలేషన్‌ వార్డుల్లో విధులు ని ర్వహిస్తున్న స్టాఫ్‌ నర్సులు, ఇతర సి బ్బం ది భయంతో పరుగులు తీశారు. కొం తసేపు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర అయోమయానికి గురయ్యారు. తోటి రో గులు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
 

దాడులకు దిగితే సహించం: డీజీపీ 
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవా రం గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా రోగులు చేసిన దాడిని ఆయన ఖండించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై దాడులకు దిగితే ఉపేక్షించబోమన్నారు. కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. ఈ మేరకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.

దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు
ఆస్పత్రుల్లో విధులు నిర్వహి స్తున్న సిబ్బందిపై దాడులకు పాల్ప డితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. వైద్యులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు. వైద్యులకు ప్రభుత్వం అన్ని విధా లుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో దాడి ఘటన నేపథ్యంలో ఆ ఆస్పత్రి సె క్యూరిటీ ఇన్‌చార్జిగా అదనపు డీసీపీ ఏ.భాస్కర్‌ను నియమిస్తూ నగర పో లీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశా రు. ఈయనకు నార్త్‌జోన్‌ అదనపు డీసీపీ శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సహకరిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

25-05-2020
May 25, 2020, 06:41 IST
న్యూఢిల్లీ:  లాక్‌డౌన్‌ వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం... దేశ విభజన తర్వాత...
25-05-2020
May 25, 2020, 06:30 IST
ముంబై: లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేయడం సరి కాదనీ, దీని వల్ల రెండింతల నష్టం సంభవించవచ్చని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే...
25-05-2020
May 25, 2020, 06:25 IST
న్యూఢిల్లీ: సంస్కరణలంటే కార్మిక చట్టాలను రద్దు చేయడం కాదనీ, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీతి...
25-05-2020
May 25, 2020, 06:19 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా చిన్నారులకు సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్‌ కార్యక్రమానికి ఆటంకం కలగడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
25-05-2020
May 25, 2020, 06:09 IST
కోల్‌కతా: గాయపడిన తన తండ్రిని సైకిల్‌ పై కూర్చొబెట్టుకొని ఢిల్లీ నుంచి దర్భంగా వరకు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన బిహార్‌కు...
25-05-2020
May 25, 2020, 06:02 IST
న్యూఢిల్లీ:  భారత్‌కు 36 రఫేల్‌ జెట్‌ విమానాల సరఫరాలో ఎలాంటి జాప్యం జరగబోదని ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లినైన్‌ చెప్పారు....
25-05-2020
May 25, 2020, 05:53 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగానే పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కేసుల విషయంలో కొత్త...
25-05-2020
May 25, 2020, 05:44 IST
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశీయ విమాన యానం పునఃప్రారంభమవుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా...
25-05-2020
May 25, 2020, 02:59 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. 5 కోట్లు జనాభా దాటిన...
25-05-2020
May 25, 2020, 02:26 IST
బీజింగ్‌: అమెరికా, చైనా మధ్య సంబంధాలు రోజు రోజుకి క్షీణిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ పుట్టుకపై అసత్యాలు ప్రచారం చేస్తూ...
25-05-2020
May 25, 2020, 02:03 IST
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, దేశీ కంపెనీల క్యూ4 ఫలితాలు, కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల ప్రకటనల వంటి కీలక అంశాలు ఈ...
25-05-2020
May 25, 2020, 01:01 IST
ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బ్లాక్‌’ అనే టైటిల్‌ ఖరారైంది. ఇందులో దర్శనా బానిక్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు....
25-05-2020
May 25, 2020, 00:51 IST
కరోనా మీద అవగాహన పెంచేందుకు, పోరాటానికి కావాల్సిన స్ఫూర్తిని అందిస్తూ ప్రతీ ఇండస్ట్రీకు సంబంధించిన స్టార్స్‌ కరోనాకు సంబంధించిన పాటలను...
25-05-2020
May 25, 2020, 00:22 IST
బాలీవుడ్‌ నటుడు కిరణ్‌ కుమార్‌ (74) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయం గురించి కిరణ్‌ మాట్లాడుతూ –...
25-05-2020
May 25, 2020, 00:17 IST
‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగిల్‌ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు...
24-05-2020
May 24, 2020, 21:16 IST
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్‌ వైద్య పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు 3 లక్షలకు పైగా కరోనా వైద్య...
24-05-2020
May 24, 2020, 20:29 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 41 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య...
24-05-2020
May 24, 2020, 17:59 IST
ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఓపెనర్‌ తౌఫీక్‌ ఉమర్‌కు కరోనా వైరస్‌ సోకింది. శనివారం రాత్రి ఆయనకు వైరస్‌...
24-05-2020
May 24, 2020, 12:35 IST
పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్‌ ఇవ్వలేదనే కోపంతో ఆశా కార్యకర్తపై క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ...
24-05-2020
May 24, 2020, 12:19 IST
న్యూయార్క్‌ : ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రముఖ దినపత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ కరోనా మృతులకు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top