కరోనా: కోలుకున్న వారు ప్లాస్మా దానం ఇవ్వండి! | Corona: CP Sajjanar Asked To Donate Plasma From Recovered People | Sakshi
Sakshi News home page

కరోనా: కోలుకున్న వారు ప్లాస్మా దానం ఇవ్వండి!

Jul 18 2020 12:48 PM | Updated on Jul 18 2020 1:33 PM

Corona: CP Sajjanar Asked To Donate Plasma From Recovered People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకున్న వారందరికీ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా తీవత్ర పెరుగుతోందని, అనేకమది వైరస్‌తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. శనివారం సీపీ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. కోవిడ్‌ బారిన పడి కోలుకున​ వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం ఇవ్వాలని కోరారు.

తమ దగ్గర తీసుకునే 500 మి. లీ ప్లాస్మా ఇద్దరు కరోనా రోగుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. సైబరాబాద్‌ పోలీసులు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించారన్నారు. దీంతో ముగ్గురిని కాపాడి వారి కుటుంబాలను ఆదుకున్నామన్నారు. కాగా ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement