వివాదాలు చెరిపినారు

యాదగరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ నిర్మాణంలో అష్టభుజి ప్రాకారం రాతి స్తంభాలపై ఏర్పాటు చేసిన వివాదాస్పద చిత్రాలను ఆదివారం తొలగించారు. రాతి స్తంభాలపై చెక్కిన సీఎం కేసీఆర్, చార్మినార్, కేసీఆర్ కిట్ వంటి తదితర చిత్రాలపై పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని తొలగించింది.
వాటి స్థానంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను చెక్కుతున్నారు. శనివారం చిత్రాలను తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అక్కడి శిల్పులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే యాదాద్రిలో రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి