కూలిన స్టేజీ.. కాంగ్రెస్‌ నాయకులకు తప్పిన ప్రమాదం

Congress party leaders fall down from election stage - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభావేదికపై కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి కార్యకర్తలకు అభివాదం చేయడానికి ముందుకు వచ్చారు. అదే సమయంలో కార్యకర్తలు ఉత్సాహంతో విజయశాంతికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలని ముందుకు రావడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ప్రమాద సమయంలో సభా వేదికపై విజయశాంతితోపాటూ, కాంగ్రెస్‌పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మరికొందరు నేతలు ఉన్నారు. షెడ్యుల్‌లో భాగంగా కాంగ్రెస్‌ నాయకులు కొల్లాపూర్‌ బహిరంగ సభ ముగించుకొని అచ్చంపేటలో సభకు హాజరయ్యారు. ప్రమాదం తర్వాత కాంగ్రెస్‌ నాయకులు ప్రచార రథంపై నిలబడి కార్యకర్తలకు అభివాదం చేసి తిరిగి హెలీక్యాప్టర్‌లో వెళ్లిపోయారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top